నీట్‌ కోచింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య | 19 Year Old NEET Coaching Student Ends Her Life At Private Hostel In Vijayawada, More Details Inside | Sakshi
Sakshi News home page

నీట్‌ కోచింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Aug 6 2026 9:33 AM | Updated on Aug 6 2026 9:49 AM

NEET Coaching Student Commits Suicide In Vijayawada

పెనమలూరు: విజయవాడ సమీపంలోని కానూరులో ఓ ప్రైవేట్‌ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ నీట్‌ కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థిని మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన కంతేటి వైష్ణవి (19) కానూరులోని శ్రీభారతి ఇనిస్టిట్యూట్‌లో నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లో చేరింది. కానూరులో ఉండటం ఇష్టం లేకపోవటంతో తండ్రి అరవింద్‌ ప్రశాంత్‌ రెండు వారాల క్రితం వైష్ణవిని ఇంటికి తీసుకెళ్లి నచ్చజెప్పి తిరిగి కానూరు కాలేజీ హాస్టల్‌కు తీసుకొచ్చారు. తనను ఇంటికి తీసుకు వెళ్లాలని.. ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, వైష్ణవి మళ్లీ తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement