మహిళా టీచర్‌పై సహోద్యోగి వేధింపులు..! | Tirupati Private School Male Teacher Attacks Female Colleague Over Photos | Sakshi
Sakshi News home page

మహిళా టీచర్‌పై సహోద్యోగి వేధింపులు..!

Aug 6 2026 9:28 AM | Updated on Aug 6 2026 12:35 PM

Female teacher Incident In Tirupathi

తిరుపతి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో మహీళ టీచర్‌గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో నిఖిల్ అనే వ్యక్తి కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సహోద్యోగి కావడంతో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెకు తెలియకుండా కొన్ని ఫోటోలను తీసుకున్నాడు. ఆ ఫోటోలను ఆమె భర్తకు పంపిస్తానంటూ, కాపురాన్ని కూలుస్తానని బెదిరిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.

నిఖిల్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో, తాళలేకపోయిన సదరు ఉపాధ్యాయురాలు నిఖిల్ ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించింది.  నిఖిల్ దయచేసి ఫోటోలు డిలీట్ చేయి, ఇకపై వేధించవద్దని కోరింది. అయితే అతడు బాధితురాలిపై తీవ్ర పదజాలంతో బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు.

ఈ దాడి, వేధింపుల నుంచి కోలుకున్న అనంతరం బాధితురాలు అలిపిరి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, నిందితుడు నిఖిల్‌పై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసుకుని, నిందితుడిపై చట్టరీత్యా చర్యలు చేపట్టడానికి దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement