అమావాస్య రోజు పూజల కలకలం.. కంట్లో కారం కొట్టిన మహిళ! | A Flurry Of Ritual Activity On The Day Of The New Moon Hyderabad Manikonda Incident | Sakshi
Sakshi News home page

అమావాస్య రోజు పూజల కలకలం.. కంట్లో కారం కొట్టిన మహిళ!

Jun 16 2026 9:17 AM | Updated on Jun 16 2026 12:24 PM

A Flurry Of Ritual Activity On The Day Of The New Moon Hyderabad Manikonda Incident

మణికొండ: అమావాస్య రోజు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేశారనే అనుమానంతో ఎదురెదురు నివాసాల వారు ఘర్షణకు దిగారు. పోలీసులు తెలిపిన మేరకు.. మణికొండ శివాజీనగర్‌ కాలనీలో ప్రభాకర్, నర్సింహాల కుటుంబాలు ఎదురెదురుగా ఉంటాయి. ప్రభాకర్‌ తోబుట్టువులు సోమవారం తమ ఇంటి ముందు  పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఎందుకు వేశారని నర్సింహా కుటుంబ సభ్యులు నిలదీశారు.

అయితే తాము వేయలేదని వాగ్వాదానికి దిగారు. ఇంతలో  ప్రభాకర్‌ సోదరి ఉమారాణి కారం తెచ్చి నర్సింహా కుటుంబ సభ్యుల కంట్లో చల్లింది. దాంతో ఓ మహిళ తీవ్ర అస్వస్థకు గురైంది. రాయదుర్గం పోలీసులకు సమాచారం అందడంతో  ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement