
హైదరాబాద్: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహా నగరం అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి పలు ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) బల్కంపేట ప్రాంతంలోని బుద్ధనగర్, గంగూబాయి బస్తీ, మైత్రీవనం ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించి అక్కడ వరద పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు తన ఆకస్మిక పర్యటన అనంతరం సీఎం రేవంత్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


బల్కంపేట ప్రాంతంలోని…
బుద్ధనగర్, గంగుబాయి బస్తీ,
మైత్రీవనం ప్రాంతాల్లో …
ఆకస్మికంగా పర్యటించాను.
భారీ వర్షాల సమయంలో…
కాలనీల్లోని ప్రాంతాల్లో…
సాధ్యమైనంత త్వరగా
నీటి ప్రవాహం జరిగి,
ముంపు తలెత్తకుండా…
తీసుకుంటున్న చర్యలను …
డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించాను.
భారీ వర్షాల… pic.twitter.com/aiHR8JcCh3— Revanth Reddy (@revanth_anumula) August 10, 2025