
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2016లో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారంటూ రేవంత్‌పై ఫిర్యాదు చేయగా.. రేవంత్‌రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది.
విచారణ పూర్తి చేసిన పోలీసులు.. అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసును కొట్టేయాలంటూ రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటరకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణ వాయిదా వేసింది.