
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. చెంప చెళ్లుమనిపించాలనిపిస్తోంది అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రామచందర్‌రావు ‘ఎక్స్’ వేదికగా కౌంటిరిచ్చారు.
‘‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??, ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని నాల్గవ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెందరు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో’ అని మండిపడ్డారు.
చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??
📌 ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాన్ను.
📌 భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి… pic.twitter.com/StKfVze1ub— N Ramchander Rao (@N_RamchanderRao) August 1, 2025