హైదరాబాద్‌లో భారీ వర్షం ..రేవంత్ ఫ్లైట్‌ దారి మళ్లింపు | CM Revanth Reddy's flight diverted due to unfavorable weather conditions | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం ..రేవంత్ ఫ్లైట్‌ దారి మళ్లింపు

Jun 12 2026 10:03 PM | Updated on Jun 12 2026 10:33 PM

CM Revanth Reddy's flight diverted due to unfavorable weather conditions

సాక్షి, హైదరాబాద్:  సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించడంతో విమానాన్ని తిరిగి బెంగళూరు తరలించారు. కాసేపటి క్రితమే విమానం అక్కడ ల్యాండయ్యింది. రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వస్తుంది.

కాగా నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌, మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, చింతల్‌, బాలానగరల్‌ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వానపడుతోంది. భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement