కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ | CM Revanth Reddy meets Union Minister Khattar | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

Jun 23 2026 11:49 AM | Updated on Jun 23 2026 11:59 AM

CM Revanth Reddy meets Union Minister Khattar

సాక్షి, ఢిల్లీ: ఈ రోజు ( మంగళవారం) కేంద్రమంత్రి మనోహార్‌ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి  భేటీ ముగిసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు నిధులు, రెండోఫేజ్‌కు అనుమతులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని  వైష్ణవ్ సైతం పాల్గొన్నారు.

కాగా నిన్న రైల్వేశాఖ మంత్రి అశ్విణీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో మెట్రో- ఫేజ్‌- 2 పనులు, ఐఆర్‌ఏఫ్‌సీ రుణాల విడుదలపై మాట్లాడారు. చర్చలు సానూకూలంగా సాగాయని విద్యుత్‌ శాఖ మంత్రితో భేటీ అనంతరం  మెట్రో విషయంలో స్పష్టత వస్తుందని రేవంత్ అన్నారు. అయితే ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ రాశారు. కేంద్ర మంత్రులతో భేటీ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రితో భేటీ ఏర్పాటు చేశారు.

కిషన్‌ రెడ్డిపై విమర్శలు

ఇటీవల మెట్రో ఫేజ్‌-2 పనులను కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్‌ రెడ్డి  కేంద్రాన్ని  ప్రశ్నించడంతో  ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు ఆపేసిందన్నారు. కిషన్ రెడ్డి పట్ల తనకు వ్యతిరేకత లేదని మెట్రో విషయంలో ఆయన ధైర్యంగా ఉంటే తాను అండగా ఉంటాను. మెట్రో విషయంలో కేంద్రం వెంటనే లోన్ రిలీజ్‌ చేయకపోతే ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement