ఆగస్టులో సీఎం అమెరికా టూర్‌ | CM Revanth Reddy America Tour From August 3rd To 11th | Sakshi
Sakshi News home page

ఆగస్టులో సీఎం అమెరికా టూర్‌

Jul 20 2024 5:25 AM | Updated on Jul 20 2024 11:10 PM

CM Revanth Reddy America Tour From August 3rd To 11th

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పలు రాష్ట్రాల్లో పర్యటన 

3న వెళ్లి 11న తిరిగి రానున్న ముఖ్యమంత్రి... ఆ తర్వాత 

దక్షిణ కొరియాకు వెళ్లే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆగస్టు 3వ తేదీ నుంచి సీఎం బృందం అమెరికాలో పర్యటిస్తుందని, అదే నెల 11న రాష్ట్రానికి తిరిగి వస్తుందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోని డల్లాస్, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూజెర్సీ రాష్ట్రాల్లో పర్యటించనున్న సీఎం బృందం, ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానుంది. 

లైఫ్‌ సైన్సెస్, ఎల్రక్టానిక్స్, ఇతర టెక్నాలజీ రంగాల్లోని ప్రముఖులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తారని సమాచారం. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌ దక్షిణ కొరియాలో పర్యటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దక్షిణ కొరియాలో నదీతీరాల అభివృద్ధిని అధ్యయనం చేయా లని సీఎం భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement