యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఒక ఇంటి నంబర్‌పై 92 ఓట్లకు పైగా ఉండగా.. మరో వార్డులో ఒకే ఇంటి నంబర్‌పై 20కి పైగా ఓట్లు ఉన్నా యి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఇటీవల అధికారులు ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలపాలని కోరారు. జాబితాలను పరిశీలిస్తే.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 6వ వార్డులోని 3–133 ఇంటి నంబర్‌తో పాటు.. అదే ఇంటికి బై నంబర్లతో సుమారు 92 ఓట్లు ఉన్నాయి.
9వ వార్డులో సైతం 4–223 ఇంటి నంబర్‌పై 20 ఓట్ల వరకు నమోదయ్యాయి. దీనిపై ఇటీవల ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత.. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దృష్టికి తీసుకువెళ్లారు. యువజన నేత నవీన్‌కుమార్ కూడా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సిబ్బందితో విచారణ చేయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లింగస్వామి తెలిపారు.


