బాలుడిపై బాలిక లైంగిక దాడి | banjara hills case files on Girl | Sakshi
Sakshi News home page

Banjara Hills: బాలుడిని లోబరుచుకున్న బాలిక

May 3 2025 7:49 AM | Updated on May 3 2025 2:31 PM

banjara hills case files on Girl

బాలిక మీద పోక్సో కేసు నమోదు

బంజారాహిల్స్‌(హైదరాబాద్): మైనర్‌ అయిన తన కుమారుడిపై బ్రదర్‌ అంటూనే ఓ బాలిక లైంగిక దాడికి పాల్పడిందంటూ బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఓ మహిళ తన భర్తతో పాటు కుమారుడితో కలిసి అక్కడే సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉంటుంది. 

స్కూల్‌ సెలవులు (School Holidays) కావడంతో కుమారుడు ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇదిలా ఉండగా వీరి క్వార్టర్స్‌ పక్క గదిలో ఉండే మరో పనిమనిషి అయిన బాలిక ఉంటుంది. సదరు బాలిక మహిళ కుమారుడిని బ్రదర్‌ అని, ఆమె కుమారుడు ఆ బాలికను సిస్టర్‌ అంటూ పిలుచుకునేవారు. ఒకసారి సదరు బాలిక తన కుమారుడిని ముద్దు పెట్టుకోవడంతో అతడిని నిలదీసింది. 

మార్చి నెలలో తాను గదిలో ఒంటరిగా ఉండగా బాలిక తనను ముద్దు పెట్టుకుందని చెప్పాడు. నిన్ను ఇష్టపడుతున్నానని, నిన్ను ఏమి చేసినా మౌనంగా ఉండాలని, లేకపోతే దొంగతనం కేసు పెట్టి మీ తల్లి ఉద్యోగం తీయిస్తానని బెదిరించిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఆమె చెప్పినట్లు బాలుడు (Boy) చేసేవాడు. ఈ క్రమంలో బాలుడిపై ఆమె లైంగిక దాడికి పాల్పడింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు యువతి మీద పోక్సో కేసు నమోదు చేశారు.

చ‌ద‌వండి: న‌న్నే నీ భ‌ర్త అనుకో.. వివాహిత‌కు వేధింపులు   

Advertisement
 
Advertisement
Advertisement