Odisha Train Accident: ఒడిషా రైలు ప్రమాదంపై రిటైర్డ్‌ ఉద్యోగి, యూనియన్‌ నేత కీలక వ్యాఖ్యలు 

Retired Railway Employee Key Comments On Odisha Train Accident - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఒడిషాలోని బాలాసోర్‌ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాద ఘటనపై రైల్వే యూనియన్‌ నేత మర్రి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిషా రైలు ప్రమాదం ఒక మిస్టరీ అని కామెంట్స్‌ చేశారు. 

అయితే, ఒడిషా రైలు ప్రమాదంపై రాఘవయ్య స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై దర్యాప్తులోనే అన్ని నిజాలు బయటపడతాయి. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేందుకు సిగ్నల్‌ ఇచ్చారు. అయినప్పటికీ రైలు లూప్‌ లైన్‌లో వెళ్లింది. లూప్‌ లైన్‌లోకి ఎలా వెళ్లిందనేది మిస్టరీగా మారింది. ఇందులో ఉగ్ర కుట్ర ఉంటుందని నేను అనుకోవడం లేదు. రైల్వేశాఖలో చాలా సంవత్సరాల నుంచి ఆటోమేటెడ్‌ సిగ్నల్‌ వ్యవస్థ నడుస్తోంది. రైల్వేలో కవచ్‌(యాంటీ కొల్యూషన్‌ డివైస్‌) వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు అని తెలిపారు. 

మరోవైపు, ఒడిషా రైలు ప్రమాదంపై సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డివిజన్‌ రిటైర్డ్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు కూడా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరపాలి. సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపంతోనే రైలు ప్రమాదం జరిగి ఉంటుంది. రైల్వే ట్రాక్‌ నిర్వహణలో అధికారులు శ్రద్ధ పెట్టాలి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రమాదానికి గురికావు.. కానీ, అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: చెల్లచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలు..జీవితంలో మర్చిపోలేని భయానక దృశ్యం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top