Odisha Train Crash Survivor: Limbless Bodies, Bloodbath On Tracks - Sakshi
Sakshi News home page

చెల్లచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలు..జీవితంలో మర్చిపోలేని భయానక దృశ్యం

Jun 3 2023 9:11 AM | Updated on Jun 3 2023 1:43 PM

Odisha Train Crash Survivor Said Limbless Bodies Bloodbath On Tracks - Sakshi

వ్యక్తిగతంగా ఆ ఘటనలో దాదాపు 200 మందికి పైగా మృతదేహాలు చూశా. కుటుంబాలకు కుటుంబాలు చితికిపోవడడ, రక్తపు మడుగులా మారిన రైలు పట్టాలు..

తూర్పుకోస్తా రైల్వే బాలాసోర్‌–బహనాగా బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెను ప్రమాదం నుంచి అనుభవ్‌ దాస్‌ అనే ప్రయాణకుడు ప్రాణాలతో బయటపడినట్లు ట్విట్టర్‌లో తెలిపాడు. తాను హౌరా నుంచి చెన్నైకి వెళ్లే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రయాణికుడుగా పేర్కొన్నాడు. ఆ ప్రమాదంలో ఎలాటి గాయాల బారిన పడకుండా సురక్షితంగా బయటపడినందుకు మొదటగా దేవుడికి ధన్యవాదాలు అంటూ.. ఆ విషాదకర ఘటన గురించి వివరించాడు.

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లోని దాదాపు 13 కోచ్‌లు దెబ్బతిన్నాయని, అలాగే బెంగుళూరు హౌరా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడు జనరల్‌ కోచ్‌లు పూర్తిగా దెబ్బతిన్నట్లు వెల్లడించాడు. తాను వ్యక్తిగతంగా దాదాపు 200కి పైగా మృతులను చూసినట్లు పేర్కొన్నాడు. కుటుంబాలకు కుటుంబాలు చితికిపోవడం, అవయవాలు తెగిపడిన శరీరాలు, రక్తపు మడుగులా మారిన రైలు పట్టాలు, తదితర భయానక దృశ్యాలు చూశానని చెప్పుకొచ్చాడు. ఇవి తాను జీవితంలో మర్చిపోలేని దారుణమైన దృశ్యాలని ఉద్వేగంగా చెప్పాడు.

ఆయా బాధిత కుటుంబాలకు దేవుడు సాయం చేయాలని, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరితగతిని కోలుకుని వారి కుటుంబ సభ్యులను చేరుకోవాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పాడు. కాగా, హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్‌(12841) ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ రైలును ఢీకొంది. ఆ ఘటన నుంచి తేరుకునేలోపే ఎదురుగా వస్తున్న బెంగళూరు -హౌరా ఎస్‌ఎంవీటీ(12864) ఎక్స్‌ప్రెస్‌ రైలు కోరమండల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 233 మంది చనిపోగా, సుమారు 900 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. 

ఈ ఘటన జరిగిన వెంటనే మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్ యూనిట్లు, 4 ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్లు, 15 ఫైర్ రెస్క్యూ బృందాలు, 30 మంది వైద్యులు, 200 మంది పోలీసు సిబ్బంది, 60 అంబులెన్స్‌లు రంగంలోకి దిగి రెస్కూ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు సాగుతున్నాయని, అలాగే సమీపంలోని ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఒడిశా ఛీఫ్‌ సెక్రటరీ ప్రదీప్‌ తెలిపారు. 

(చదవండిపట్టాలపై మృత్యుకేళి.. ఘటనపై దర్యాప్తునకు హైలెవల్‌ కమిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement