ఫిలింనగర్‌: ఉద్యోగం మానేశానని భర్తకు ఫోన్‌ చేసి .. ఇంట్లో నుంచి బయటకు | married woman missing in hyderabad | Sakshi
Sakshi News home page

ఫిలింనగర్‌: ఉద్యోగం మానేశానని భర్తకు ఫోన్‌ చేసి .. ఇంట్లో నుంచి బయటకు

Jul 3 2023 1:04 PM | Updated on Jul 3 2023 1:04 PM

married woman missing in hyderabad - Sakshi

ర్త ప్రవీణ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి తాను ఉద్యోగం మానేశానాని ఇంటిలో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పి ఫొన్‌ స్విచ్ఛాప్‌ చేసింది.

హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌లోని బాలరెడ్డినగర్‌లో నివసించే సాయి కృష్ణవేణి విప్రో సర్కిల్లోని ఓ బ్యాంక్‌ లో పనిచేస్తుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నారు.

ఈ నెల 1న తన భర్త ప్రవీణ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి తాను ఉద్యోగం మానేశానాని ఇంటిలో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పి ఫొన్‌ స్విచ్ఛాప్‌ చేసింది. ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. తన భార్య కనిపించడం లేదంటూ ప్రవీణ్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement