చందనాలంకరణలో శ్రీవారు | - | Sakshi
Sakshi News home page

చందనాలంకరణలో శ్రీవారు

Feb 9 2026 7:45 AM | Updated on Feb 9 2026 2:27 PM

Lord Lakshmi Narasimha on a golden Garuda

బంగారు గరుడ వాహనంపై లక్ష్మీనరసింహ స్వామి

రాపూరు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం శ్రీవారి జన్మనక్షత్రం స్వాతి అయినందున స్వామివారి మూలమూర్తికి చందనంతో అలంకరించారు. దేవస్థాన ఆచారం, స్వామివారికి ఉదయం అభిషేకం, చందన అలంకరణ చేశారు. రాత్రి బంగారు గరుడ వాహనంపై ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

బెయిల్‌పై పరారైన వ్యక్తి అరెస్ట్‌

తిరువొత్తియూరు: బెయిల్‌పై విడుదలై పోలీసులకు చిక్కకుండా పారిపోయిన వ్యక్తి పట్టుబడ్డాడు. చైన్నె కొత్తచాకలిపేటలో 2022 సంవత్సరంలో జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 2022, ఏప్రిల్‌ 17న కొత్తచాకలిపేట ప్రాంతంలో జీవన్‌కుమార్‌ (25) హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి మంగమ్మాళ్‌ తోట ప్రాంతానికి చెందిన మనోజ్‌ (23) అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఆ తర్వాత ఈ కేసులో మనోజ్‌ కోర్టులో బెయిల్‌ పొంది బయటకు వచ్చాడు. ఈ హత్య కేసు విచారణ మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని 1వ అదనపు సెషన్‌న్స్‌ కోర్టులో జరుగుతోంది. అయితే, బెయిల్‌పై బయటకు వచ్చిన మనోజ్‌ కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని 2025, నవంబర్‌ 26న కోర్టు వారెంట్‌ జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు, పోలీసులు మంగమ్మాళ్‌పేటతోట 6వ వీధిలో ఉంటున్న మనోజ్‌ను (26) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

కరాటేలో నవశక్తి ప్రతిభ

తిరుపతి సిటీ: చైన్నెలో నిర్వహించిన జాతీయ స్థాయి నాల్గవ వరల్డ్‌ మాస్టర్స్‌ కరాటే ఓపెన్‌ చాంపియన్‌షిప్‌–2006లో తిరుపతికి చెందిన ర్యాలీ నవశక్తి మరోసారి తన ప్రతిభను చాటింది. ఆదివారం క్వీన్‌ మేరీస్‌ కాలేజీలో నిర్వహించిన ఈ పోటీలలో మహిళల ఓపెన్‌ కటా విభాగంలో నవశక్తి ఉత్తమ ప్రతిభను కనబరచింది. పలు రాష్ట్రాల నుంచి తనకంటే పెద్ద వయస్కులు ఈ పోటీల్లో పాల్గొన్నా అద్భుతంగా రాణించింది. బంగారు పతకం సాధించారు. వెంకీ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీలో కోచ్‌ వెంకటేశ్వర్లు వద్ద తాను శిక్షణ పొందినట్లు ఆమె తెలిపారు.

Navashakti is the best talent1
1/1

నవశక్తి ఉత్తమ ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement