తమిళనాడు: బస్సు లేక 56 ఏళ్లుగా అవస్థలు పడుతున్న కొండ గ్రామ ప్రజల కలలో తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో ఆ గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వివరాలు.. తేని జిల్లాలోని మారుమూల కోటగుడి కొండ గ్రామం ప్రాంతం చాలా మంది సినిమాటోగ్రాఫర్‌లను ఆకర్షించింది. ఈ ప్రాంతంలోని కోటగుడి కొండ గ్రామంలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది నీలగిరి పరిధిలో ఉంటుంది.
ఈ గ్రామానికి చెందిన 25 మందికి పైగా పిల్లలు పోడి నాయక్కనూరులోని ప్రభుత్వ , ప్రభుత్వ – సహాయక పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కోటగుడి నుండి బస్సు సౌకర్యాలు లేకపోవడంతో, ఇక్కడి నుండి పాఠశాలకు వెళ్లే పిల్లలు రోజూ 2 నుండి 3 కిలోమీటర్లు నడిచి, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లడానికి కోటగుడి డివిజన్ సమీపంలోని కురంగానికి బస్సు ఎక్కవలసి వచ్చేది. దీంతో కోటగుడి కొండ గ్రామానికి బస్సు, మినీబస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
తాజాగా సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ తక్షణ చర్యలు తీసుకున్నారు. కోట గుడి కొండకు ప్రభుత్వ బస్సు సర్వీసును ప్రారంభించే విషయంపై అధ్యయనం చేయాలని తేని జిల్లా కలెక్టర్ వైద్యనాథన్ రాష్ట్ర రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, కోట గుడి రోడ్డుపై బోడి నుండి కురంగణి వరకు ఉదయం 3.30 నుండి సాయంత్రం 5.30 వరకు బస్సును నడపాలని నిర్ణయించారు. మొదటిసారిగా బస్సు గ్రామంలోకి ప్రవేశించడాన్ని చూసి మలై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.


