డిసెంబర్‌ నాకు స్పెషల్‌ | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ నాకు స్పెషల్‌

Dec 5 2024 1:41 AM | Updated on Dec 5 2024 1:48 PM

తమిళసినిమా: సెంటిమెంట్స్‌ అనేవి అందరికీ ఉంటాయి. సినిమారంగంలో కాస్త ఎక్కువ అనే చెప్పాలి. ఇక నమ్మకాలు కూడా ఉంటాయి. అందుకు ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉంటుంది. ఏదైనా కలిచిరావడమే అల్టిమేట్‌ కారణం అవుతుంది. నటి రష్మిక మందన్నా కూడా అలాంటి నమ్మకం ఉందంటోంది. 

పుష్ప చిత్రంతో నేషనల్‌ క్రష్‌గా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తున్నా, ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాలపై కాన్సట్రేషన్‌ పెడుతుందనే ప్రచారం జోరందుకుంది. అందుకు కారణం అక్కడ వరుసగా చిత్రాలు అంగీకరించడమే కావచ్చు. ఇకపోతే ఈమె నటుడు అల్లు అర్జున్‌కు జంటగా నటించిన పుష్ప – 2 చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌కు యూనిట్‌తో పాటు రష్మిక మందన్నా కూడా బాగానే కష్టపడింది. 

తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళ నాడు, కర్ణాటక, కేరళా, ముంబాయ్‌ అంటూ ప్రచారానికి తెగ తిరిగేసింది. కారణం ఈ చిత్రంపై ఆమె పెట్టుకున్న నమ్మకం అలాంటిదట. ఇకపోతే ఇటీవల రష్మిక మందన్నా ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. అందులో డిశంబర్‌ నెల తనకు చాలా ప్రత్యేకం అని పేర్కొంది.

పుష్ప చిత్రం డిశంబర్‌ నెలలోనే విడుదలయ్యిందని, ఆ తరువాత హిందీ చిత్రం యానిమల్‌ కూడా డిశంబర్‌లోనే తెరపైకి వచ్చిందని ఈ రెండు చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయని చెప్పింది. ఇక ప్రపంచ వ్యాప్త సినీ అభిమానులు ఎదురు చూస్తున్న పుష్ప–2 చిత్రం కూడా డిసెంబర్‌ 5వ తేదీన విడుదల కావడం సంతోషంగా ఉందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 

కాగా తాజాగా నటి రష్మిక మందన్నా నటుడు ధనుష్‌ కథానాయకుడిగా, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు నాగార్జున ప్రధాన పాత్రను పోషిస్తున్న కుబేర చిత్రం, హిందీలో సల్మాన్‌ఖాన్‌ సరసన సికిందర్‌ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా ఈమె ఉమెన్స్‌ సెంట్రిక్‌ కథా పాత్రలో నటించిన గర్ల్‌ ఫ్రెండ్‌ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. కాగా ఇటీవల ఈ అమ్మడు వాణిజ్య ప్రకటనలలోనూ నటించడం మొదలెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement