పెళ్లి ఆగిపోయిందని బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

పెళ్లి ఆగిపోయిందని బలవన్మరణం

Jul 18 2023 10:00 AM | Updated on Jul 19 2023 10:00 AM

- - Sakshi

పెళ్లి రద్దు కావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

కొరుక్కుపేట: పెళ్లి రద్దు కావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పుదుచ్చేరిలోని లియోనూర్‌ సమీపంలోని బంగోర్‌ గంగయమ్మన్‌ కోయిల్‌ వీధికి చెందిన విమల కుమారుడు భాస్కరన్‌ (28) పుదువాయిలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి రెండు వారాల క్రితం నిశ్చితార్థం అయింది. ఇంతలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో పెళ్లి ఆగిపోయింది.

దీంతో మనస్తాపానికి గురైన భాస్కరనన్‌ ఆదివారం రాత్రి కందియాంగుప్పం రైల్వేగేటు సమీపంలో నడుచుకుంటూ వెళ్లి విల్లుపురం వైపు వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ఎదురు వెళ్లాడు. రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే రైలు ఆపి అతడిని ఎక్కించుకుని చినబాబుముట్రం స్టేషన్‌లో దించారు. జిప్‌మార్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు జిప్‌మర్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విల్లుపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement