మహిళను వేధిస్తున్న.. ఎస్‌ఐ సహా నలుగురు కానిస్టేబుళ్ల...  | - | Sakshi
Sakshi News home page

మహిళను వేధిస్తున్న.. ఎస్‌ఐ సహా నలుగురు కానిస్టేబుళ్ల... 

Jun 22 2023 8:14 AM | Updated on Jun 22 2023 8:14 AM

- - Sakshi

హాస్టల్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ ఎస్‌ఐ, ముగ్గురు పోలీసులు మహిళతో

తమిళనాడు: తిరుచ్చి సమయపురంలో హాస్టల్‌లో ఉంటున్న మహిళను వేధించిన ఎస్‌ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లను అధికారులు బదిలీ చేశారు. వివరాలు.. తిరుచ్చి మారియమ్మన్‌ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. యాత్రికుల వసతి కోసం ఉచిత మండపాలు, వసతి గృహాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం సమయపురం ఆలయానికి ఓ జంట ఇక్కడి హాస్టల్‌లో ఉంటోంది.

హాస్టల్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ ఎస్‌ఐ, ముగ్గురు పోలీసులు మహిళతో దురుసుగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారని.. ప్రశ్నించిన భర్తపై దాడికి పాల్పడినట్టు తెలిసింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు రహస్య విచారణ చేశారు. మహిళకు వేధింపులు ఇచ్చిన సంగతి నిజమేనని తేలింది. దీంతో సమయపురం పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ ప్రకాష్‌, కుమారేశన్‌లను పుదుకోటై జిల్లాకు, తిరుమేనిని పెరంబలూరు జిల్లాకు, సెయ్యరాసును అరియలూరు జిల్లాకు బదిలీ చేస్తూ డీఐజీ శరవణ సుందర్‌ ఆదేశించారు. ఈ చర్య పోలీసు శాఖలో కలకలం రేపింది.

Advertisement
 
Advertisement
Advertisement