నాటుసారా నివారణకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

నాటుసారా నివారణకు చర్యలు చేపట్టాలి

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

సోంపేట: స్థానిక ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో నాటుసారా తయారీ, అమ్మకాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుర్జిత్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌ తిరుపతినాయుడు సోంపేట ఎకై ్సజ్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టేషన్‌ పరిధిలో కేసులు నమోదు చేయబడి పరారీలో ఉన్నవారి వివరాలు సేకరించి, తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని సూచించారు. గతంలో నాటు సారా అమ్మకాలు జరిపి, ఇప్పుడు సారా అమ్మకాలు మానివేసిన వారిని గుర్తించి.. వారికి ఇతర ఉపాధి అవకాశాల మార్గాలు చూపించాలన్నారు. స్టేషన్‌ పరిధిలో అవసరమైన చోట్ల చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం జింకిభద్రలో మద్యం దుకాణాన్ని పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. వారితో పాటు ఎకై ్సజ్‌ సీఐ జీవీ రమణ, ఎస్‌ఐ ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement