కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్‌ను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్‌ను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

ఎచ్చెర్ల:

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ విభాగం కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్‌ పొన్నాడ రామకృష్ణపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎంసీఈ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. వర్సిటీలోని వీసీ చాంబర్‌ ముందు బుధవారం వారంతా నిరసన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ను ఆరు నెలలు సస్పెండ్‌ చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు తెలిపారు. ఫ్యాకల్టీ మధ్య ఉన్న వివాదాన్ని సాకుగా చూపుతూ సస్పెండ్‌ చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందన్నారు.

మాజీ మంత్రి సీదిరి కస్టడీ

పిటీషన్‌ డిస్మిస్‌

శ్రీకాకుళం క్రైమ్‌ : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు 4 రోజుల పాటు కస్టడీ విచారణ కోరుతూ వేసిన పిటీషన్‌ను పలాస కోర్టు బుధవారం డిస్మిస్‌ చేసింది. కుమారుడి రోడ్డు ప్రమాద ఘటనలో మాజీ మంత్రిపై కేసు నమోదు చేయడంతో ఆయన అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు. గురువారం ఈ కేసుకు సంబంధించి సోంపేట కోర్టులో హియరింగ్‌ ఉంది. ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవి, కార్యకర్తల బెయిల్‌ పిటీషన్‌పైనా గురువారమే హియరింగ్‌ ఉన్నట్లు సమాచారం.

చింతాడ కేసులో మరో ఇద్దరు సరెండర్‌

ఆమదాలవలస: వైఎస్సార్‌ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌, మరో 26 మందిపై నమోదైన కేసులో బుధవారం నానుపాత్రుని సురేష్‌, గురుగుబెల్లి భాస్కరరావు ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో సరెండర్‌ అయిపోయారు. వీరిని ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement