శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్ల సమ్మె రెండోరోజు బుధవారం కూడా కొనసాగింది. వారంతా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాల ఎదుట బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు త్వరితగతిన పరిష్కరించి పేద రోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనలను తుంగలో తొక్కి నియామకాలు చేపట్టడం సరికాదన్నారు. ఇదిలా ఉండగా వీరు ఆందోళన చేస్తున్న సమయంలో అత్యవసర కేసులు వచ్చిన పక్షంలో జూనియర్ డాక్టర్లందరూ క్యాజువాలిటీకి వెళ్లి వైద్య సేవలు అందించారు. ఓపీ, ఐపీలకు మాత్రమే సేవలందించకుండా దూరంగా ఉన్నారు. కార్యక్రమంలో శశి సతీష్, మదన్ ప్రసన్న సుదర్శన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


