ఆమదాలవలస: వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై అక్రమంగా నమోదు చేసిన చేసిన కేసులో మరో 11 మంది సరెండర్ అయ్యారు. ఈ అంశంలో మొత్తం 27 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో మంగళవారం ఆమదాలవలస పోలీసుల వద్ద 11 మంది సరెండర్ కాగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 30వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా బూర్జ మహిళా ఎస్సై ప్రవళ్లికపై అనుచితంగా ప్రవర్తించా రన్న ఆరోపణలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీ సులు అక్రమంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు చింతాడ రవికుమార్‌తో పాటు మరి కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం ఈనెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించారు. తాజాగా దుంపల శ్రీనివాసరావు బొడ్డేపల్లి శ్రీనివాసరావు, అన్నెపు కృష్ణారావు, చింతాడ రాఘవేంద్రరావు, చిగురుపల్లి గిరి, కూన ధర్మారావు, గురుగు బిల్లి నవీన్, సనపల తవిటయ్య, మొదలవలస మురళి, చింతాడ యతీంద్ర, పొన్నాడ చిన్నారావు మంగళవారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో సరెండర్ అయ్యారు. వీరిని ఎస్‌ఐ సనపల బాల రాజు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా 21 వరకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. వీరిని అంపోలు జైలుకు తరలించారు.


