శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యా ర్థులు, హౌస్ సర్జన్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో, బోధన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వీరంతా తమ స మస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం రిమ్స్‌లో కూడా జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పటికీ అవి విఫలం కావడంతో ఆందోళన బాట పట్టాల్సి వ చ్చిందని చెప్పారు. ప్రస్తుతం తాము అత్యవసర సేవలకు మాత్రం హాజరవుతామని తెలిపారు. డి మాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఈ నెల 15 తర్వాత ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శశి, సతీష్, మదన్, ప్రసన్న, సుదర్శన్, అశోక్ తదితరులు ప్రసంగించారు.


