ఆమదాలవలస: వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై పెట్టిన అక్రమ కేసులపై గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేడర్‌పై ఉందని ఆ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు అన్నారు. పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం ఆమదాలవలస మున్సిపాలిటీ, మండలంలోని పార్టీ వివిధ కార్యవర్గాల సభ్యులు, క్యాడర్‌తో సమావేశమై రవికుమార్ అరెస్టుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమదాలవలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్, కూటమి నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. మహిళా ఎస్‌ఐను బలి పశువును చేసి చింతాడ రవికుమార్‌పై అక్రమ కేసు పెట్టి, అరెస్టు చేయడం పోలీసులకు తగదన్నారు. ప్రస్తుతం పోలీసులు పచ్చచొక్కాలు వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని దయ్యబట్టారు. నియోజకవర్గంలో సామాన్యుడైన చింతాడ రవికుమార్ రాజకీయాల్లోకి వస్తే ఆయనను ఎదగనీయకుండా అక్రమ కేసులు బనాయించడం తదగని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస మండల పార్టీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామమూర్తి, ఆమదాలవలస జెడ్పీటీసీ బెండి గోవిందరావులు అన్నారు. ఈ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ జిల్లా మహిళా విభాగ సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి అజంతాకుమారి, ముఖ్య నాయకులు దుంపల శ్యామలరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, జానకిరావు, మామిడి రమేష్, చింతాడ వెంకటరమణ, దన్నాన అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


