ప్రభుత్వాల నిరంకుశ వైఖరి నశించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాల నిరంకుశ వైఖరి నశించాలి

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

ప్రభుత్వాల నిరంకుశ వైఖరి నశించాలి

టెక్కలి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ సోమవారం టెక్కలిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైల్‌ భరో కార్యక్రమా న్ని నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ కొనసాగించా రు. మానవహారం నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 35 వేలు అందజేయా లని, స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని, గిరిజనుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఉపాధి చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ నాయకులు బి.వాసు, కోత మధు, కె.ఎల్లయ్య, అప్పారావు, పి.ధర్మారావు, హెచ్‌.ఈశ్వ ర్రావు, టి.వైకుంఠరావు, యు.లక్ష్మణరావు, పి.ఆనంద్‌, మాధవరావు ఉన్నారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం

వజ్రపుకొత్తూరు రూరల్‌: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పలాస–కాశీబుగ్గలో శాంతియుతంగా చేపడుతున్న జైల్‌ భరో ర్యాలీ పట్ల పోలీసులు వ్యవహారించిన తీరు అప్రజాస్వామ్యకరమైన చర్య అని ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో ప్రజా సంఘాలు జైల్‌భరో కార్యక్ర మం చేపట్టారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు సరికాదని అన్నారు. సీపీఎం నాయకులు కె.మోహన్‌రావు, లిబరేషన్‌ నాయకులు టి.సన్యాసిరావు, న్యూడె మోక్రసీ నాయకులు వి.మాధవరావు, జుత్తు వీరస్వా మి, పౌర హాక్కుల సంఘ నాయకులు పి.దానేసు, రైతు కూలీ సంఘ జిల్లా నాయకులు జి.బాలక్రిష్ణ, ప్రజా సంఘ నాయకులు మద్దిలి రామారావు, ఎస్‌.లక్ష్మీనారాయణ, ఎం.వినోద్‌కుమార్‌, టి.అజయ్‌కుమార్‌, కోనేరు రమేష్‌, టి.భాస్కరరావు, దీలీప్‌, ఎన్‌.మోహన్‌రావు, చంద్రయ్య, బి.ఈశ్వరమ్మ, పి.కుసుమ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement