అక్షరాలు నేర్చుకున్న వయసు దాటి.. జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకున్నా నాటి స్నేహం చెరిగిపోలేదు. ఐదు దశాబ్ధాలుగా పైగా కాలం గడిచిన తర్వాత పదో తరగతి నాటి సహచరులంతా మళ్లీ ఒకేచోట కలుసుకున్నారు. మళ్లీ ఒకరినొకరు చూసుకోగానే నాటి జ్ఞాపకాలు కళ్లముందే కదలాడడంతో ఉత్సాహంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ విషయాలు, కష్ట సుఖాలు, బాగోగులు గురించి తెలుసుకున్నారు. చిన్ననాటి అల్లరంతా గుర్తుకు చేసుకొంటూ ఆనందంగా గడిపారు.
ఇచ్ఛాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1973–74 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 52 ఏళ్ల తర్వాత సోమవారం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్న
సందర్భంగా సందడి చేశారు. – ఇచ్ఛాపురం


