ఉద్యమాలతోనే హక్కుల సాధన | - | Sakshi
Sakshi News home page

ఉద్యమాలతోనే హక్కుల సాధన

Aug 11 2026 2:12 AM | Updated on Aug 11 2026 2:12 AM

ఉద్యమాలతోనే హక్కుల సాధన

వజ్రపుకొత్తూరు రూరల్‌: ఉద్యమాలతోనే ఉపాధ్యాయుల హక్కుల సాధన సాధ్యమని యూటీఎఫ్‌ నాయకులు అన్నారు. వజ్రపుకొత్తూరులో సోమవా రం యూటీఎఫ్‌ 52వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు ఉపాధ్యా య సంఘ నాయకులు మాట్లాడుతూ యూటీఎఫ్‌ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడు తుందని, పోరాట ఫలితంగా ఉపాధ్యాయుల హక్కులను, ప్రయోజనాలను సాధించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చి అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటినా, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నేరవెర్చలేదని విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు రూ.25 వేల కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు గుంటు కోదండరావు, జిల్లా కార్యదర్శి కంచరానరమేష్‌, మండల శాఖ అధ్యక్షుడు రత్నాల సురేష్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు పైల సంజయ్‌కుమార్‌, ప్రధా న కార్యదర్శి చొక్కర ధర్మారావు, చంద్రశేఖర్‌, అనందరావు, శంకర్‌రావు, జయరాం, సుందరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement