శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో శుక్రవారం సాయంత్రమే దూరప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు చేరుకున్నారు. వారి తిరుగు ప్రయాణాలతో రద్దీ కనిపించింది. అలాగే అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడం కూడా కనిపించింది. వచ్చిన బస్సులు వచ్చినట్లుగానే ప్రయాణికులతో నిండిపోవడం కనిపించింది.
–శ్రీకాకుళం అర్బన్


