సౌతిండియా యోగాసనాల పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

సౌతిండియా యోగాసనాల పోటీల్లో సత్తా

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

సౌతిండియా యోగాసనాల పోటీల్లో సత్తా

ఇచ్ఛాపురం: తమిళనాడు యోగా స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌, కై రలి యోగా విద్యా పీఠం ఆధ్వర్యంలో తిరువల్లూరు జిల్లా, గుమ్ముడిపూండి జెఎఫ్‌ఎన్‌ పారడైస్‌లో నిర్వహించిన సౌతిండియా యోగాసనాల పోటీల్లో పట్టణానికి చెందిన పాలేపు సాయిజగదీష్‌ సత్తా చాటి నాలుగు పతకాలు కై వ సం చేసుకున్నాడు. ఆదివారం నిర్వహించిన యోగాసనాల పోటీల్లో 13 నుంచి 16 ఏళ్ల విభాగంలో యోగా ట్విస్టింగ్‌ ఆసనాల్లో బంగారుపతకం, యో గా ఫార్వర్డ్‌ బెండింగ్‌ ఆసనాల్లో రజత పతకం, స్టాండింగ్‌ ఆసనాల్లో రజత పతకం, బ్యాక్‌వర్డ్‌ బెండింగ్‌ ఆసనాల్లో కాంస్యం సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement