సదుపాయాలు లేవు.. | - | Sakshi
Sakshi News home page

సదుపాయాలు లేవు..

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

సదుపాయాలు లేవు.. ● సమస్యల వలయంలో టెక్కలి పాలిటెక్నిక్‌ కాలేజీ ● మంజూరు కాని పోస్టులు ● తగ్గిపోతున్న చేరికలు చేరికలు కావు

● సమస్యల వలయంలో టెక్కలి పాలిటెక్నిక్‌ కాలేజీ ● మంజూరు కాని పోస్టులు ● తగ్గిపోతున్న చేరికలు

నందిగాం:

టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ సమ స్య లతో కునారిల్లుతోంది. నందిగాం మండలం తురకలకోట సమీపంలో నడుపుతున్న ఈ కాలేజీ సమస్యల వలయంలో చిక్కుకుంది. కాలేజీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఈ కాలేజీని 2013లోనే స్థాపించినా 2017 జూన్‌లో శ్రీకాకు ళం నుంచి ఇక్కడకు మార్పు చేశారు. గతంలో ఇక్కడ ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ ఉండేది. ఆ కాలేజీలో ప్రవేశాలు లేక నష్టాలతో నడవడంతో అప్పటి టీడీ పీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ద్వారా ఈ కాలేజీ కొనుగోలు వ్యవహారం నడిచింది. ఆ తర్వాత పాలిటెక్నిక్‌ కాలేజీ టెక్కలి పేరుతో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లు ఉండగా ప్రతి కోర్సుకు 54, ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 5 కలిపి 59 సీట్లు అందుబాటులో ఉంచి కౌన్సిలింగ్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు.

అధ్యాపకుల కొరత, మారుమూల ప్రాంతంలో ఉండటం, హాస్టల్‌ లేకపోవడంతో ఈ కాలేజీలో చే రేందుకు విద్యార్థులు మొగ్గుచూపడం లేదు. జాతీ య రహదారికి దూరంగా ఉండటం, కాలేజీకి వెళ్లే మార్గమంతా దట్టమైన తోటలు, కొండ ఉండటంతో బాలికలను ఈ కాలేజీలో చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు సుముఖంగా ఉండటం లేదు. దీంతో ఇక్కడ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ ఏడాది మొదటి విడత కౌన్సిలింగ్‌లో ఈఈఈలో 54, సివిల్‌లో 40 మంది ఈ కాలేజీకు అలాట్‌ అయ్యారు. కానీ కాలేజీ తీరు చూసి రెండో కౌన్సెలింగ్‌లో మరో కాలేజీకి వెళ్లిపోయారు. హైవే నుంచి కాలేజీ సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు దూరం ఉంటుంది.

సిబ్బంది ఏరీ..?

కాలేజీ స్థాపించి 12 ఏళ్లు అవుతున్నా నేటికీ సరిపడా అధ్యాపకులను నియమించలేదు. పాలిటెక్నిక్‌ కాలేజీలో టీచింగ్‌ విభాగంలో ఒక ప్రిన్సిపాల్‌, ప్రతి విభాగానికి ఐదుగురు లెక్చరర్లు, ఇంగ్లీష్‌, మ్యాఽథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులకు ఒక్కొక్కరు చొప్పున్న నలుగురు ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ కాలేజీలో ప్రిన్సిపాల్‌ లేకపోవడంతో డిప్యూటేషన్‌పై ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ) ఉంటూ ప్రిన్సిపాల్‌ విధులు నిర్వహిస్తుండగా, ఈఈఈ బ్రాంచ్‌కు ఒక రు, సివిల్‌ బ్రాంచ్‌కు ఒకరు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులకు ఒక్కొక్కరు చొప్పున్న నలుగురు ఉన్నారు. నాన్‌ టీచింగ్‌ విభాగంలో ఏఓ, ఆఫీస్‌ సూపరెండెంట్‌, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్లు, నలుగురు ఆఫీస్‌ సబార్డినేట్లు, ముగ్గురు స్వీపర్లు, ఇద్దరు వాచ్‌ మెన్లు, ముగ్గురు ల్యాబ్‌ అటెండర్లు ఉండాల్సి ఉండ గా ఒక్కరు మాత్రమే ఉండటంతో అన్ని పనులు ఓ ఎస్‌డీ, ఇతర అధ్యాపకులే చేసుకోవాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement