డ్వాక్రా.. ఆక్రందన | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా.. ఆక్రందన

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

డ్వాక్రా.. ఆక్రందన జియో ట్యాగింగ్‌ రద్దు చేసేస్తాం

డ్వాక్రా సభ్యులకు ని‘బంధనాలు’

ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి

స్థానికంగా లేని వారికి తప్పని ఇబ్బంది

నెలవారీ సమావేశాల్లో 80 శాతం

మంది ఉండాలని నిబంధన

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

డ్వాక్రా సంఘాలకు నిబంధనల బంధనాలు వేస్తున్నారు. డ్వాక్రా మహిళలు ప్రతి నెల సమావే శం నిర్వహిస్తారు. బ్యాంక్‌లో తీసుకున్న రుణాల వాయిదాలను సభ్యులు లీడర్‌, సెకండ్‌ లీడర్లకు అందజేస్తారు. గ్రామ ఆర్గనైజేషన్‌ సహయకులు (వీఓఏ) సమక్షంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇలా సేకరించిన డబ్బును వారు బ్యాంక్‌లో చెల్లిస్తా రు. సమావేశంలో డ్వాక్రా సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్న విధానం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త విధానం అమలు చేసింది. సమావేశం సందర్భంగా సభ్యులకు ముఖ ఆధారిత హాజరు విధానం (ఎస్‌ఆర్‌ఎస్‌)ను తప్పని సరిగా చేసింది. అంటే ప్రతి నెల గుర్తింపు కోసం ఫొటో తీసుకోవాల్సిందే. అలా తీసిన ఫొటో ఆన్‌లై న్‌ అప్‌లోడ్‌ చేయాలి. ఈ నిర్ణయంపై డ్వాక్రా సభ్యు లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు అందరు సభ్యులు హాజరవుతారు. గ్రూప్‌లో ఫొటోతో పాటు బ్యాంకు అధికారికి కనిపించి రుణాలు తీసుకుంటారు. మళ్లీ నెల నెలా ఫొటోలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

సమావేశంలో సభ్యుల హాజరుపైనే ఆ గ్రూప్‌ గ్రామ సమాఖ్య, మండల సమాఖ్య గ్రేడింగ్‌ ఆధారపడి ఉంటుంది. గ్రేడింగ్‌ తగ్గితే ఆ సంఘం సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణం, జాతీయ జీవనోపాధుల (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద ఇచ్చే రుణాలు అందవు. సమావేశం జరిగే ప్రాంతాన్ని ముందుగానే జియో ట్యాగింగ్‌ చేస్తారు. సభ్యులందరూ అక్కడకి వచ్చి సమావేశమైతేనే యాప్‌లో వారి హాజరు నమోదవుతుంది. ప్రతి సంఘం నుంచి కనీసం 80 శాతం హాజరు ఉంటేనే యాప్‌ పరిగణనలోకి తీసుకుంటుంది. లేదంటే సమావేశం జరగనట్టే. అప్పుడు ఆ సంఘం గ్రేడింగ్‌ పడిపోతుంది. అయితే గ్రూపు సభ్యుల్లో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి పని చేసే వారు ఉంటారు. చిన్నపాటి ఉద్యోగాలు చేసే వారు, వలస వెళ్లే వారు ఇలా ప్రతి నెలా హాజరు కావడం కుదరని పని. మిగతా వారితో సమావేశం నిర్వహించినా అది జరగనట్టే చెబుతుండడంతో ఇబ్బంది తప్పడం లేదు.

ప్రతి నెల గ్రూపులో సభ్యులు ఫొటో తీసుకుని ఆన్‌లైన్‌ చేసుకోకపోతే బ్యాంకు నుంచి లేక సీ్త్ర నిధి నుంచి తీసుకున్న రుణం మొత్తం చెల్లించాలని, గ్రూప్‌ గ్రేడింగ్‌ తగ్గితే సమస్యలు వస్తాయని, ఇతర సభ్యు లు రాని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. రాని వారు గ్రూ పు నుంచి తొలగిపోవాలని చెబుతున్నారు. సంఘా ల సభ్యులతో పాటు డ్వాక్రా అధికారులు, సిబ్బంది నుంచి ఈ ఒత్తిడి అధిమవుతోంది. దీంతో చాలా మంది తాజాగా తీసుకున్న రుణం బకాయి తీరిపో తే, అసలు పొదుపు సంఘమే వద్దు, పూర్తిగా రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement