● జిల్లాలో పెట్రోల్ కొరత
● స్పీడ్ పెట్రోల్ మాత్రమే లభ్యం
● మరో రెండు రోజులపాటు ఇంతే
అంటున్న పెట్రోల్ బంక్ వర్గాలు
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో మళ్లీ పెట్రోల్ కొరత ప్రారంభమైంది. ప్రస్తుతానికి జిల్లాలో స్పీడ్ పెట్రోల్ మాత్రమే చాలాచోట్ల విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఈ కొరత అధికంగా కనిపిస్తోంది. సాధారణ పెట్రోలు మరో రెండు రోజుల పాటు అందుబాటులో ఉండదని చెబుతున్నారు. ఇటీవల రెండు రోజులు సెలవులు వచ్చాయని, అందువల్ల పెట్రోల్ కంపెనీల ఫిల్లింగ్‌లో జాప్యం జరిగిందని అందుకే సాధారణ పెట్రోల్ అమ్మలేకపోతున్నా మని యజమానులు చెబుతున్నారు. అయితే పలు బంకుల్లో స్పీడ్ పెట్రోల్ చాలాకాలంగా ఉండిపోవడం వల్ల సాధారణ పెట్రోల్ విక్రయాలు కావాలనే ఆపి స్పీడ్‌పెట్రోల్ అమ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పెట్రోల్ ధర బాగా పెరిగిపోయింది. దీంతో పాటు సాధారణ లీటరు పెట్రోల్ ధరకి, స్పీడ్ పెట్రోల్ ధరకు మధ్య వ్యత్యాసం దాదాపు రూ.5లు ఉంది. దీంతో స్పీడ్ పెట్రోల్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనుకంజ వేస్తున్నా రు. ప్రధానంగా నగరంలో బలగ, తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యత్యాసం వల్ల రోజుకు రూ.2.50 లక్షల వరకు అదనపు భారం ప్రజలపై పడుతోంది.


