కొనసాగుతున్న వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వైద్య సేవలు

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

గార: మండలంలోని శాలిహుండం కస్తూర్బా విద్యాలయంలో ప్రబలిన డయేరియా తగ్గుముఖం పట్టడం లేదు. ఆదివారం నలుగురు విద్యార్థినులు వ్యాధి లక్షణాలతో బాధపడుతుండటం, కొత్తగా ఒక విద్యార్థినికి డయేరియా రావడంతో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ కొత్త కేసులు వస్తుండడంతో ఆందోళన పెరుగుతోంది. ఆదివారం అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చా రు. చికిత్స పూర్తి చేసుకున్న విద్యార్థినులు వారి ఇళ్లకు వెళ్లిపోయారు.

‘పాతిక వేల చొప్పున

ఎస్సీ ఓట్లు తొలగించే కుట్ర’

ఇచ్ఛాపురం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌లో దళితులను అణగదొక్కేందుకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ‘ఎస్‌ఐఆర్‌’ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలో పాతిక వేల ఎస్సీ ఓట్లను తొలగించే కార్యక్రమానికి పూనుకుందని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకటరావు ఆరోపించారు. మాలల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన ‘మాలల ఐక్యతా చైతన్య యాత్ర’ ఆదివారం ఇచ్ఛాపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్‌ కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ మాల ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పో యిందని, ఎస్సీలమంటూ సమస్యలతో స్థానిక ఎమ్మెల్యే, పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్లినా న్యాయం దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేపట్టిన ఎస్సీ వర్గీకరణతో మాలలు రిజర్వేషన్‌ పరంగా అన్ని అర్హతలను కోల్పోయారని, ఇటీవల డీఎస్సీలో మెరి ట్‌ జాబితాలో ఉన్న ఎస్సీ మాల వర్గానికి చెందిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యా యం జరిగిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మాల జాతి ప్రజలపై కూటమి ప్రభుత్వం క్రూరమైన వివక్షపూరిత విధానాలు అవలంబిస్తోందని, ఆగస్టు 11న ఏలూరులో 30 ఏళ్ల మాల మృతవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నామని అన్నారు.

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌గా సోమేష్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్థాయి సీనియర్స్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కవిటికి చెందిన జి.సోమేష్‌ కై వసం చేసుకున్నాడు. రన్నరప్‌గా ఎస్‌సీఐబీసీకి చెందిన ఎ.అభిరామ్‌ నిలిచాడు. శ్రీకాకుళం జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వర్గీయ నారాయణశెట్టి వెంకట శ్రీనివాసులు జ్ఞాపకార్థం నగరంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండు రోజుల జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. అంతకుముందు క్వార్టర్‌ఫైనల్స్‌ నుంచి ఫైనల్స్‌ పోరు వరకు జరిగిన మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగాయి. తుది పోరులో అండర్‌–19 బాలుర విభాగంలో సోంపేటకు చెందిన ఎం.అభి విజేతగా నిలవగా, వీబీఏకు చెందిన కె.రోణి రన్నరప్‌గా నిలిచాడు.

చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమనే విషయాన్ని 3వ అదనపు జిల్లా జడ్జి సీహెచ్‌ వివేక్‌ ఆనంద్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బ్యాడ్మింటన్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. రెండు రోజుల బ్యాడ్మింటన్‌ టోర్నీకి చేసిన ఏర్పాట్లు, బ్యాడ్మింటన్‌ సంఘ ప్రగతి గురించి బ్యాడ్మింటన్‌ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు వివరించారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నారాయణశెట్టి వెంకట కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇక్క డ విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వివిధ జిల్లాల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్టు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement