ఫీడ్‌ ధరలు తగ్గించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

ఫీడ్‌ ధరలు తగ్గించాలని వినతి

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

సంతబొమ్మాళి: రొయ్యల ఫీడ్‌ ధరలు తగ్గించాలని ఆక్వా రైతులు కోరారు. ఈ మేరకు స్టేట్‌ ఆక్వా ఫెడరేషన్‌ పిలుపుతో తహసీల్దార్‌ హేమసుందర్‌రావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఫీడ్‌ ధరలు విపరీతంగా పెరగడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగానికి విదేశీ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ, రైతులు మాత్రం నష్టాలను చవిచూస్తున్నారని వాపోయారు. ఫీడ్‌ ధరలతో పాటు సాగు ఖర్చులు భారీగా పెరిగినప్పటికీ.. రొయ్యల ధరలు మాత్రం తగ్గాయన్నారు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆక్వా రైతులు కెల్లి జగన్నాయకులు, పాల వసంతరెడ్డి, మేరుగు అప్పారావు, నక్క భీమారావు, జోగి రాములమ్మ, బి.మోహన్‌రెడ్డి, ఎం.నాగభూషణరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement