మన సచివాలయాలు | - | Sakshi
Sakshi News home page

మన సచివాలయాలు

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

సేవాలయాలు.. మన సచివాలయాలు

సేవాలయాలు..

గ్రామ స్వరాజ్యం సాకారం చేసిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

732 సచివాలయాల్లో

5301 మంది

ఉద్యోగులతో అద్భుత సేవలు

నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు

అరసవల్లి:

కప్పుడు గ్రామమంటే సర్కార్‌ బడి, గుడి, పంచాయతీ కార్యాలయం, అక్కడక్కడా వైద్య కేంద్రం మినహా మరే ఇతర ప్రభుత్వ భవనాలు కనిపించేవి కావు. 2019కి పూర్వం వరకు రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు, గ్రామానికి ఆస్తులు కూడా ఆ నాలుగు భవనాలే. అయితే 2019 తర్వాత గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. ఏ చిన్న అవసరానికై నా పంచాయతీ కేంద్రానికి, అక్కడ పని అవ్వకపోతే..మండల కేంద్రం...ఆపై జిల్లా కేంద్రానికి పరుగులు పెట్టే పరిస్థితులకు చెక్‌పెడుతూ మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అసలుసిసలైన గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది. ఇంటి వద్దకే సేవలందించేలా అద్భుతమైన సచివాలయ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా అమలు చేసింది. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజి హెల్త్‌ క్లినిక్‌ తదితర భవనాల నిర్మాణాలు పూర్తి చేసింది. ప్రజలకు అన్ని రకాల సేవలను ఇంటి గడపకే అందించేలా వలంటీర్ల వ్యవస్థ కూడా అనుబంధంగా చేర్చింది. దీంతో మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి వెళ్లే అవసరాలు తగ్గిపోయాయి.

జిల్లాలో సేవలందుతున్నాయిలా....!

ప్రభుత్వాలు మారినప్పటికీ...గ్రామాల్లో పట్టణాల్లో నేరుగా ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను అందించే విషయంలో సచివాలయాలే కీలక కేంద్రాలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేరు మార్చి కొనసాగిస్తోంది. అయితే సేవలను తగ్గించడంతో పాటు ఉద్యోగులపై తీవ్ర స్థాయి ఒత్తిళ్లు పెంచడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని 30 మండలాల్లో మొత్తం 647 గ్రామ సచివాలయాలు, 85 వార్డు సచివాలయాలు ఉండగా, ఇందులో మొత్తం 5301 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు విధులను అందిస్తున్నారు. ఇక సచివాలయాల్లో మొత్తం 548 రకాల ప్రభుత్వ సేవలను వివిధ రకాలుగా ప్రజలకు నిర్ణీత గడువులోగా అందిస్తోంది. 2019–24లో ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా జిల్లాలో వివిధ రకాల సేవలను మొత్తం 53,22,317 మందికి సచివాలయాల ద్వారా అందాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సేవలు విషయంలో ఆంక్షలు మొదలయ్యాయి. సేవలందించే విధానంలో చాలా మార్పులు వచ్చి మళ్లీ దళారిల వ్యవస్థ రాజ్యమేలే పరిస్థితులు వచ్చాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement