
సీఎం పర్యటనకు 1500 మంది పోలీసులతో బందోబస్తు
ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడగుట్లపాలెంలో శనివారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చెప్పారు. బుడగుట్లపాలెంలో పోలీస్ అధికారులతో శుక్రవారం భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ముఖ్యమంత్రి వచ్చిన నుంచి పర్యటన పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలు పార్కింగ్, తనిఖీ లు వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. నలుగురు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలతో కూడిన అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తారని చెప్పారు. 17 రోప్, స్పెషల్, క్యూఆర్డీ టీంలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. హెలీప్యాడ్, సభావేదిక, ఆలయ దర్శనం, లబ్ధిదారులతో ముఖా ముఖి వంటి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.