ధాన్యం తూకంలో తేడాలపై ఫిర్యాదులకు ఫోన్ చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం తూకం, తరుగు లేదా ఇతర సమస్యలపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం డివిజన్ 94942 33490 (ఆర్డీవో కార్యాలయం), టెక్కలి డివిజన్ 97040 33093, పలాస డివిజన్ 7386189275 ధాన్యం సేకరణలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, రైతులు ఈ ఫోన్ నంబర్లను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
కాశీబుగ్గ డీఎస్పీగా షాయిక్ సెహబాజ్
శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ సబ్‌డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ)గా షాయిక్ సెహబాజ్‌ను నియమిస్తూ మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. పాడేరు నుంచి ఆయన బదిలీపై రానున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఇదివరకు డీఎస్పీగా పనిచేసిన వి.వి.అప్పారావు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వీఆర్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే.
సరుబుజ్జిలి: వ్యవసాయ శాఖలో ఎదుర్కొంటున్న పలు రకాల ఒత్తిళ్ల నుంచి విముక్తి కలిగించాలని జిల్లా రైతు సేవా కేంద్రాల ఉద్యోగుల (గ్రామ వ్యవసాయ సహాయకులు) వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేర కు అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం జిల్లాకేంద్రంలో వ్యవసాయశాఖ జేడీ త్రినాథస్వామికి మంగళవారం వినతిపత్రం అందించారు. అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతూ రైతులకు చెందిన ఎరువుల సొసైటీలు, పీఏసీఎస్‌ల ద్వారా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఆర్‌ఎస్‌కేల ద్వారా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఐదు నెలలు గడిచినప్పటికీ చాలా మండలాల్లో వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వలేదన్నారు. వ్యవసాయ పనులతోపాటు, జీఎస్‌డబ్ల్యూ సర్వేలు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్లకు అప్పగిస్తున్నారని, ఈ– క్రాప్ పూర్తయిన వరకు సర్వేలు ఆపాలని కోరారు.
27లోగా టీసీసీ పరీక్షల ఫీజు చెల్లించాలి
శ్రీకాకుళం : వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలకు ఈ నెల 27లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు మంగళవారం తెలిపారు. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 7వ తరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు టీసీ సీ పరీక్షలు రాయడానికి అర్హులని పేర్కొన్నా రు. డ్రాయింగ్ (లోయర్ గ్రేడ్) రూ.100, డ్రా యింగ్ (హయ్యర్ గ్రేడ్) రూ.150, హ్యాండ్లూం వీవింగ్ (లోయర్ గ్రేడ్) రూ.150, హ్యాండ్లూం వీవింగ్ (హయ్యర్ గ్రేడ్) రూ.200, టైలరింగ్, ఎంబ్రాయిడరీ (లోయర్ గ్రేడ్) రూ.150, టైలరింగ్ ఎంబ్రాయిడరీ (హయ్యర్ గ్రేడ్) పరీక్ష ఫీజు రూ.200 చొప్పున చెల్లించాలన్నారు. ఆలస్య రుసుంతో జనవరి 3వ తేదీలోగా, రూ.75 ఫీజుతో జనవరి 6వ తేదీలోగా చెల్లించవచ్చని పేర్కొన్నారు.
కాలువలో శ్రమదానం
సారవకోట: మండలంలో అత్యంత విస్తీర్ణంలో ఉన్న రంగసాగరం ఎడమ కాలువను ఏటా ఆ యకట్టు రైతులే బాగు చేసుకుంటున్నారు. సారవకోట, జగన్నాఽథపురం, బురుజువాడ, రైవాడ, అగదల, కొత్తూరు, అలుదు, వండాన వల గ్రామాల్లో ఉన్న రైతులకు రంగసాగరం నీరు ఎంతో అవసరం. దీంతో ఏటా పూడికలతో నిండిపోయే కాలువను రైతులే బాగు చేసుకుంటారు. జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులు గానీ రంగసాగరం నీటి సంఘం ప్రజాప్రతినిధులు గానీ దీనిపై దృష్టి సారించక పోవడంతో రైతులే శ్రమదానం చేసుకుంటున్నారు. మంగళవారం ఆయా గ్రామాల కు చెందిన సుమారు 30 మంది రైతులు శ్రమదానంతో కాలువలో పూడికలు తొలగించారు. సు మారు నాలుగైదు రోజుల పాటు శ్రమదానం చేసి పూడికలు తొలగిస్తూ ఉంటామని చెబుతున్నారు.
ధాన్యం తూకంలో తేడాలపై ఫిర్యాదులకు ఫోన్ చేయండి


