భయోమెట్రిక్‌ | - | Sakshi
Sakshi News home page

భయోమెట్రిక్‌

Dec 24 2025 12:41 PM | Updated on Dec 24 2025 12:41 PM

భయోమె

భయోమెట్రిక్‌

అలర్ట్‌

● వేలి ముద్రలు చోరీ చేసి డబ్బులు కాజేస్తున్న వైనం

● ఏఈపీఎస్‌పై అవగాహన లేక ప్రజల జేబులకు సైబర్‌ నేరగాళ్ల చిల్లు

● డబ్బులు పోతే

1930కు కాల్‌ చేయాలంటున్న పోలీసులు

జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకు కస్టమర్‌ ఖాతాలో తనకు తెలియకుండానే పలుదఫాలుగా రూ. 96,500లు మాయమయ్యాయి. ఫోన్‌కు మెసేజ్‌లు కూడా రాలేదు. సడెన్‌గా ఓ రోజు బ్యాంకుకెళ్తే విషయం తెలిసి అవాక్కయ్యాడు. అప్పుడు గుర్తొచ్చింది. అతను తన వేలిముద్రను రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో ఒకసారి వేశారు.

లాసలో ఓ సీమెన్‌ విధుల్లో ఎక్కడో ఉంటారు. ఆయన ఏటీఎం కార్డు, బ్యాంకు బుక్‌లు అన్నీ భార్య వద్దనే ఉన్నాయి. రూ. 4 లక్షల పైగా ఉన్న తన ఖాతాలో భార్య తీయకుండానే డబ్బులు రూ. 1.50 లక్షలు వారం రోజుల్లో మాయమయ్యాయి. బ్యాంకుకు తన భార్య వెళ్లాక ఎవరో సీమెన్‌ ఆధార్‌ బయోమెట్రిక్‌లో ప్రవేశించి ఖాతా ను, యూపీఐ పిన్‌ నంబర్‌ తదితర వివరాలన్నీ తెలుసుకుని డబ్బులు తస్కరించాడని తెలిసింది.

శ్రీకాకుళం క్రైమ్‌ :

ప్రతి చిన్న పనికీ తప్పనిసరిగా మారిపోయిన బయోమెట్రిక్‌ భయోమెట్రిక్‌గా మారుతోంది. జిల్లాలో ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌, డిజిటల్‌ అరెస్టు, కస్టమర్‌ కేర్‌ పేర్లతోనే కాక ఆధార్‌కార్డు వేలిముద్రలు, కంటి ఐరిష్‌ ద్వారా కేటుగాళ్లు ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేలి ముద్రలతో వారేమైనా నేరాలు చేస్తే ఎక్కడ జైలుకెళ్లాల్సివస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

డేటా చౌర్యం జరుగుతోందా..?

ఇప్పుడు ప్రతి చిన్న పనికీ మిషన్‌పై వేలి ముద్ర వేయడం పరిపాటుగా మారింది. ఈ సమాచారాన్ని ఎవరో దొంగిలిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఏఈపీఎస్‌ (ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సర్వీస్‌) మోసాలకు ఆజ్యం పడేది ఆ వేలిముద్రలు వేసే చోటులోనేని బ్యాంకు వర్గాలు తమకొచ్చిన కస్టమర్ల ఫిర్యాదుల ఆధారంగా చెబుతున్నా రు. ఇదివరకు మీరు ఎక్కడైనా వేలిముద్ర వేశారా అంటే.. భూమి అమ్మినప్పుడు వేశాం. లేదంటే కొన్నప్పుడు వేశామని ఎక్కువమంది చెబుతున్నట్లు గుర్తించారు.

ఫింగర్‌ ప్రింట్స్‌ తస్కరిస్తున్నారిలా..

సైబర్‌ మోసగాళ్లు పలు శాఖల వెబ్‌సైట్లలోకి అక్రమంగా చొరబడి దస్త్రాల్లోని ఫింగర్‌ప్రింట్‌ పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకుని వాటి ద్వారా ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌తోనే రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యే అవకాశముంది. కానీ గెస్ట్‌ గా లాగిన్‌ అయ్యే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని పత్రాలను కాజేసి దస్త్రాల్లోని వేలిముద్రలను సేకరించేందుకు నేరస్తులు బటర్‌ పేపర్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం. బటర్‌ పేపర్‌పై ఉన్న ఫింగర్‌ప్రింట్‌ను గాజు గ్లాసుపై ముద్రించి రబ్బర్‌ పో యడం ద్వారా పాలిమర్‌ ప్రింట్‌ను తయారు చేయడంతో ఫేక్‌ ఫింగర్‌ప్రింట్స్‌గా మారుతాయి. బయో మెట్రిక్‌ మెషిన్‌లోకి ఈ ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్‌ పెట్టి సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదును ఖా ళీ చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొన్న మన ఫింగర్‌ ప్రింట్‌, ఐరిష్‌ డేటా ద్వారా బ్యాంకు ఖాతా లోకి చొరబడి బ్యాంకు స్టేట్‌మెంట్‌, బ్యాలె న్సు ఎంకై ్వరీ వివరాలు తెలుసుకోవడం, డబ్బులు ట్రా న్స్‌ఫర్‌ చేయడమే కాక హ్యాక్‌ కూడా చేసే ప్రమాదాలు ఉన్నాయి.

పాటించాల్సిన జాగ్రత్తలు

● సాధ్యమైనంత వరకు ఫింగర్‌ ప్రింట్‌, ఐరిష్‌ వేయకుండా నేరుగా బ్యాంకు ద్వారా విత్‌డ్రా, డిపాజిట్‌ చేసుకుంటే మంచిది.

● ఏఈపీఎస్‌ ద్వారా నేరాలను ఆపాలంటే ఆధార్‌కు లాక్‌ పెట్టుకోవడం, ఆధార్‌లో ఉన్న బయోమెట్రిక్‌కు లాక్‌ పెట్టుకోవడం ఉత్తమం.

● ఆధార్‌ కానీ, బయెమోట్రిక్‌ కానీ సెకెండ్‌వే అథంటికేషన్‌ పెట్టుకుంటే అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యేముందు మన సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్‌ చేస్తే కానీ డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ కావు. సైబర్‌ నేరగాళ్లు బయోమెట్రిక్‌ లాక్‌ దొంగిలించినా పైవిధంగా ఓటీపీని ఎంటర్‌ చేస్తేనే దానిని యాక్సెస్‌ అయ్యేలా ఇది పనిచేస్తుంది.

సైబర్‌

అప్రమత్తత మేలు

అకౌంటులో డబ్బులు పోయాయని తెలిసిన వెంటనే సైబర్‌ సెల్‌ 1930కు కాల్‌చేసి వివరాలు చెప్పాలి.

మీ పరిధిలో ఉన్న పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ అయ్యేటట్లు చూసుకోవాలి.

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం సంబంధిత బ్యాంకుకు వెళ్లి పోలీస్‌ స్టేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ కాపీని లేదంటే ఆన్‌లైన్‌ ఫిర్యాదు కాపీని సమర్పించాలి.

బ్యాంకులో ఉన్న లావాదేవీల డిస్ప్యూట్‌ ఫామ్‌లో వివరాలు నింపి బ్యాంకు ప్రతినిధులకివ్వాలి. వారు కన్సల్టింగ్‌ పై అథారిటీ వారికి పంపిస్తారు.

120 రోజుల్లో 99 శాతం డబ్బులు వచ్చే అవకాశం ఉంది. రాకుంటే బ్యాంకులు మీద కూడా అంబుడ్స్‌మన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.

భయోమెట్రిక్‌ 1
1/1

భయోమెట్రిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement