పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తల్లిదండ్రులు లేని పేద విద్యార్థినులకు వసుదైక కుటుంబ యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు సైకిళ్లు పంపిణీ చేశారు. నగరంలో ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెమినార్ హాల్‌లో బుధవారం 25 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సమన్వయకర్త హరిప్రసన్న మాట్లాడుతూ జిల్లాలో ఐదు విడతలుగా 150 సైకిళ్లు అందజేశామన్నారు. కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్, పాతపట్నం సబ్ రిజిస్ట్రార్ జి.రాజు, పి.గోవిందరావు, ఎల్.గుణశేఖర్, సాయికుమార్, ఆర్.పాపారావు తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం: లావేరు మండలంలోని సుభద్రపురం జాతీయ రహదారి–16పై విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ బుధవారం ఉదయం 3 గంటల సమయంలో ఢీకొన్నట్లు లావేరు పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో వెనుక నుంచి బలంగా ఢీకొనడం జరిగింది. దీంతో వెనుక ఉన్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్ ఎం.కృష్ణ(54)కు తీవ్రగాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో గవర్నమెంట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీనిపై లావేరు ఎస్‌ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
చికిత్స పొందుతూ
యువకుడు మృతి
రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఇజ్జాడ గణేష్(20) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు లావేరు పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం మధ్యాహ్నం సుభద్రపురం గ్రామానికి చెందిన ఇజ్జాడ గణేష్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇజ్జాడ గణేష్‌కి తీవ్రగాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడుకి తండ్రి రమణ, తల్లి సత్యవతి, అన్నయ్య ఉన్నాడు. లావేరు ఎస్‌ఐ అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థికి అరుదైన అవకాశం
మెళియాపుట్టి: మండలంలోని చాపర జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సహిత విద్యార్థి బి.జ్ఞాన సాయి సత్తాచాటాడు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో లోకోమోటోలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ అధిరోహణకు మార్గం సుగమమైందని ఎంఈవోలు దేవేంద్రరావు, పద్మనాభరావు పేర్కొన్నారు. దీంతో విద్యార్థిని బుధవారం అభినందించారు.
పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ


