కుష్టు వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కల్చరల్: కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక కరుణ సమాజంలో రెడ్‌క్రాస్ సంస్థ, ఆర్ట్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులతో మాట్లాడుతూ వారి సమస్యను తెలుసుకున్నారు. వ్యాధిగ్రస్తుల పెన్షన్, మరుగుదొడ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, రేషన్ తదితర విషయాలపై చర్చించారు. అనంతరం 35 మంది కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ పి.జగన్మోహన్‌రావు, సెక్రటరీ మల్లేశ్వరరావు, అప్ హోల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ తిమోతి, రెడ్‌క్రాస్ జిల్లా ఎంసీ మెంబర్లు డాక్టర్ నిక్కు అప్పన్న, నూక సన్యాసిరావు, హరి సత్యనారాయణ, చిన్మయిరావ్, జి.రమణ, సత్యనారాయణ, చైతన్యకుమార్, ఉమా శంకర్, వెంకటరమణ, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
కుష్టు వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం


