● డ్రగ్స్ వద్దంటూ..
టెక్కలి: మత్తు పదార్థాల బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి సూచించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోలీస్ శాఖ చేపట్టిన అభ్యుదయం సైకిల్‌యాత్ర బుధవారం టెక్కలి చేరుకుంది. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మణరావు నేతృత్వంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు పట్టణంలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి, సీఐ ఎ.విజయ్‌కుమార్, ఎంవీఐ సంజీవరావు, ఎస్‌ఐలు రాము, రఘునాథరావ పాల్గొన్నారు.


