చంద్రకళా.. నీది గొప్ప జన్మ | - | Sakshi
Sakshi News home page

చంద్రకళా.. నీది గొప్ప జన్మ

Jun 13 2023 11:30 AM | Updated on Jun 13 2023 11:54 AM

చిన్నారులకు నగదును అందజేస్తున్న గ్రామస్తులు   - Sakshi

చిన్నారులకు నగదును అందజేస్తున్న గ్రామస్తులు

తాను చనిపోతూ మరో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించిన పట్నాన చంద్రకళ

శ్రీకాకుళం: తాను చనిపోతూ మరో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించిన పట్నాన చంద్రకళను గ్రామస్తులు వేనోళ్ల కీర్తించారు. చంద్రకళ చేసిన త్యాగం నిరుపమానమని, ఆమెది గొప్ప జన్మ అని కొనియాడారు. మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) బ్రెయిన్‌డెడ్‌ అవ్వడంతో ఈనెల 2వ తేదీన మృతి చెందారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె అవయవాలను దానం చేశారు.

ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలో చంద్రకళ సంతాప సభ నిర్వహించారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో స్థానికులు, యువత కలిపి రూ.2 లక్షలు సేకరించి వారి పేరున డిపాజిట్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బగాది అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌ నల్లి తవిటినాయుడులతోపాటు గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. ఈ కుటుంబంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆదుకోవాలని స్థానికులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement