ఈ పనులు కబ్జాలు.. కూల్చివేతలు.. సెటిల్‌మెంట్లే | - | Sakshi
Sakshi News home page

ఈ పనులు కబ్జాలు.. కూల్చివేతలు.. సెటిల్‌మెంట్లే

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

● అరసవల్లిలో అధికార పార్టీ అరాచకాలు

● కూటమి అధికారంలోకి రాగానే ఆదిత్యాలయ దుకాణాలు, భవనాల కూల్చివేత

● తాజాగా ఎన్నికల్లో స్థానిక యువతపై పోలీసుల కేసులంటూ భయభ్రాంతులు

అరసవల్లి: సాక్షాత్తు ఆదిత్యుడు కొలువై ఉన్న అరసవల్లి ప్రశాంతతకు మారుపేరు. దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు జరుగుతున్నా ఏనాడూ ఉద్రిక్త పరిస్థితి అన్నదే లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఆ ప్రశాంతతను చెడగొట్టింది. రెడ్‌బుక్‌ రాజ్యాంగ ముద్రలతో అరసవల్లికి అరాచకాన్ని పరిచయం చేసింది. అధికారం చేపట్టిన నెలల గడువులోనే అరసవల్లిలో గ్రామ పెద్దలుగా ఉన్న పలువురిని టార్గెట్‌ చేసి వారి పేరుప్రఖ్యాతలపై దెబ్బ కొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. అలాగే ఇక్కడి యువతపై పోలీసులను ఉసిగొల్పుతోంది.

అభివృద్ధి మాటున విధ్వంసం

టీడీపీ నాయకులు అధికారం చేపట్టిన కొద్ది నెలలకే రథసప్తమి ఉత్సవాలంటూ ఆలయం ముందున్న భారీ భవనాల సముదాయాలను నేలకూల్చే పను లు మొదలెట్టేశారు. భక్తుల సౌకర్యార్థం దాతలు నిర్మించిన రూ.లక్షల విలువైన భారీ జింకు రేకుల షెడ్లను మూడు రోజుల్లోనే కూల్చేశారు. అలాగే ఆలయానికి చెందిన 12 దుకాణాల సముదాయా న్ని, 15 వసతి గదుల సముదాయాన్ని,అలాగే దాతలతో నిర్మించిన అన్నదాన మండపాన్ని, సూ ర్యనమస్కారాల మండపాన్ని, ప్రసాదాల తయారి, విక్రయించే గదులతో పాటు టీటీడీ సత్రం, గదులను కూడా కూల్చేశారు.

కబ్జాలు..సెటిల్‌మెంట్లు

అరసవల్లి గ్రామ పరిధిలో ఇంతకుముందు ఎన్న డూ లేని విధంగా కబ్జాలు, సెటిల్‌మెంట్లకు టీడీపీ నేతలు పూనుకుంటున్నారు. ఆదిత్యాలయ భూము లతో పాటు నగర పాలక సంస్థకు చెందిన రిజర్వ్‌ స్థలాలను కూడా కబ్జా చేశారు. కూటమి పెద్దల పేరుతో హడావుడి చేస్తూ తమకు నచ్చిన స్థలాలను వినియోగంలోకి తెచ్చేసుకున్నారు. ఇప్పటివరకు అరసవల్లికి పెద్ద దిక్కుగా ఉన్న ‘గుండ’ కుటుంబాన్ని ఒంటరి చేసే ప్రయత్నం చేశారు. ఆ కుటుంబ పెద్దకు అనారోగ్యం చేస్తే కనీసం పరామర్శించలేదు. ఆదిత్యాలయ అభివృద్ధికి తన శక్తికి మించి కృషి చేస్తూ ఉన్న ఓ పెద్దాయనపై కూడా కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కూడా అరసవల్లికే చెందిన మరో రాజకీయ కుటుంబానికే చెందిన కోడలు ఎచ్చెర్ల దివ్యశ్రీధర్‌ను గెలవనీయకుండా అడ్డుకుని ఏడిపించారు.

అరసవల్లిలో

కూల్చేసిన శాశ్వత భవనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement