ఆమదాలవలస: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకూడదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షు డు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాల నాయు డు, జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతాకుమారికి పార్టీ బీ–ఫారంను సోమవారం పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. పెన్షన్ ఆపుతాం సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని, ఓటర్లు వీరి పని పట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ మా జీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఫొటోః16ఎఎంవి05,05(ఎ) ఆమదాలవలస చైర్‌పర్సన్ అభ్యర్థికి బి– ఫారం అందిస్తున్న కృష్ణదాస్ తదితరులు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్
ఫొటోః16ఎఎంవి05(బి),05(సి) విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు


