జి.సిగడాం: మండలంలోని వాండ్రంగి హెల్త్ క్లీనిక్ కేంద్రం పనితీరుపై జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలశాఖ (ఎన్క్యూఏఎస్) ఆన్లైన్ ద్వారా సోమవారం పరిశీలించింది. కేంద్రంలో పలు రకాల వ్యాధుల కోసం మందులు, రోగుల కోసం మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
జిల్లా నాణ్యతా హమీ ప్రమాణాల శాఖ అధికారి మంత్రి రవికుమార్ సమక్షంలో ఆన్లైన్ ద్వారా పరిశీలించారు. వైద్యులు బుడుమూరు యశ్వంత్, పేకల సుమబిందు, సీహెచ్వో కోట సత్యంనాయుడు, హెచ్వీ కృష్ణవేణి, సూపర్వైజర్లు జి.భాస్కరరావు, కె.శ్రీనివాసులనాయుడు, ఏఎన్ఎంలు అన్నపూర్ణ, ఉదయలక్ష్మి, ఎంఎల్హెచ్పీ సంధ్య తదితరులు పాల్గొన్నారు.


