పంచాయతీల రెండో విడత నోటిఫికేషన్‌ జారీ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల రెండో విడత నోటిఫికేషన్‌ జారీ

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

అరసవల్లి: పంచాయతీల రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ మేరకు జిల్లాలో మొత్తం ఎచ్చెర్ల, పాతపట్నం, ఆమదాలవలస నియోజవర్గాల పరిధిలోని 13 మండలాల్లో మొత్తం 386 పంచాయతీల్లో ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. తాజాగా సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో రెండో విడతలో పోలింగ్‌ జరగనున్న గ్రామ పంచాయతీల వివరాలతో పాటు అభ్యర్థులకు సూచనలతో కూడిన వివరాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి వెల్లడించారు. ఈ ప్రకారం జిల్లాలో ముందుగా శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు, బూర్జ మండలాలతో పాటు టెక్కలి డివిజన్‌ పరిధిలోని కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, పాతపట్నం, మెళియాపుట్టి తదితర 13 మండలాల్లోని మొత్తం 386 పంచాయతీలు, 3600 వార్డు సభ్యుల స్థానాలకు ఈనెల 29న పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల నియమావళి మేరకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 478 లొకేషన్లలో 3634 పోలింగ్‌ కేంద్రాలను, మొత్తంగా 3996 బ్యాలెట్‌ బాక్సులను కూడా సిద్ధం చేశారు.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

● నామినేషన్ల స్వీకరణ: 18వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 20 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు.

● ఈనెల 21న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.

● 24న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.

● 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే.

● అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి.

● ఈ నెల 30న అవసరమైతే రీపోలింగ్‌..అదే రోజు ఫలితాల వెల్లడి.

రెండో విడత ఇలా...

మండలం పంచాయతీలు వార్డులు

పాతపట్నం 34 306

మెళియాపుట్టి 37 322

హిరమండలం 23 198

కొత్తూరు 43 382

ఎల్‌ఎన్‌ పేట 22 196

ఆమదాలవలస 30 272

బూర్జ 30 270

పొందూరు 29 298

సరుబుజ్జిలి 21 188

ఎచ్చెర్ల 26 282

రణస్థలం 34 344

లావేరు 26 252

జి.సిగడాం 31 290

మొత్తం 386 3600

13 మండలాల్లో 386 పంచాయతీలు, 3600 వార్డులకు ఎన్నికలు

18 నుంచి నామినేషన్ల స్వీకరణ

20 లోగా స్వీకరణకు గడువు

29న పోలింగ్‌, ఫలితాల వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement