అరసవల్లి: నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న గుండ లక్ష్మీదేవి సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఆమె సోమవారం ఉదయం అరసవల్లిలోని స్వగృహం వద్ద బయల్దేరారు. అనంతరం సూర్యనారాయణ స్వామి ఆలయం మీదుగా గ్రామ దేవత అసిరితల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా మొక్కుకుంటూ అభిమానుల నడుమ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా హుందాగా తన నామినేషన్ల పేపర్లను జాయింట్ కలెక్టర్‌కు అందించారు. ఆమెతో పాటు కుమారుడు గుండ విశ్వనాథ్, స్థానిక వ్యాపారవేత్త బోయిన సూర్యనారాయణ తదితరులున్నారు. అలాగే కూటమి పార్టీల తరఫున జనసేన నేత దానేటి రాధారాణి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
ముగిసిన నామినేషన్ల పర్వం


