ఆ పనులు అభివృద్ధికి ఆనవాళ్లు | - | Sakshi
Sakshi News home page

ఆ పనులు అభివృద్ధికి ఆనవాళ్లు

Nov 17 2026 12:38 AM | Updated on Nov 17 2026 12:38 AM

● వైఎస్సార్‌ సీపీ హయాంలో సిక్కోలుకు కొత్త శోభ

● రూ.7.25కోట్లతో బ్యూటిఫికేషన్‌

● రూ.3.70కోట్లతో పార్కుల అభివృద్ధి

● టీడీపీ హయాంలో కూల్చివేతలు..

ౖపైపె మెరుగులతో బిల్లులు స్వాహా

సాయంత్రమైతే నగర ప్రజలు సేద తీరేందుకు, ఉదయాన వాకింగ్‌ చేసేందుకు, పిల్లల ఆట విడుపు కోసమని వైఎస్‌ జగన్‌ హయాంలో నగరంలోని ఆరు పార్క్‌లను అభివృద్ధి చేశారు. రూ.3.70కోట్లతో గ్రీనరీతో కూడిన అభివృద్ధి చేశారు. శాంతినగర్‌లో ఉన్న గాంధీ మందిరం పార్క్‌ను రూ. 40లక్షలు, శాంతినగర్‌ కాలనీలో ఉన్న నాగావళి రివర్‌ వ్యూ పార్క్‌ను రూ. కోటితో, కొత్తపేటలో ఉన్న చల్లా నర్సింహం మున్సిపల్‌ పార్క్‌ను రూ. 60లక్షలతో, బాపూజీ కళా మందిర్‌లో దగ్గరలో ఉన్న గాంధీ పార్క్‌ను రూ. 40లక్షలతో, ఆఫీషియల్‌ కాలనీలో ఉన్న డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ పార్క్‌ను రూ. 40లక్షలతో, న్యూకాలనీలో ఉన్న డైమండ్‌ పార్క్‌ను రూ. 30లక్షలతో, పీఎన్‌కాలనీ పార్క్‌ను రూ. 60లక్షలతో సుందరీకరణ చేశారు. కాంపౌండ్స్‌, వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్స్‌ తదితర వసతులు, సౌకర్యాలు సమకూర్చారు. రూ.2.20కోట్లతో విజయాదిత్య పార్క్‌ను ఆధునీకరించేందుకు నిధులు కేటాయించారు. కానీ టీడీపీ వచ్చి రెండేళ్లు దాటిపోయినా 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు.

ఘన చరితకు ఆనవాలు..

వేల ఏళ్ల సిక్కోలు ఘన చరిత జిల్లాకు వచ్చిన వారందరికీ తెలియజెప్పేందుకు కుడ్య చిత్రాల సాయం తీసుకున్నారు. నగరంలోని 33 ప్రదేశాల్లో పరిశుభ్రంగా, అందంగా కనిపించేలా రంగులు వేశారు. ప్రభు త్వ కార్యాలయాల కాంపౌండ్‌ వాల్స్‌కు, మూడు ఫ్లై ఓవర్లకు, నాలుగు బ్రిడ్జిలకు, సెంట్రల్‌ డివైడర్లకు, కళాశాలలు, స్కూల్స్‌ కాంపౌండ్‌ వాల్స్‌కు ఆయా ప్రాంత విశిష్టత, పిల్లలను అలరించే చిత్రాలను పెయింటింగ్స్‌ రూపంలో వేశారు. ఈ మేరకు రూ.75 లక్షలు ఖర్చు చేశారు. వాటికి టీడీపీ హయాంలో ౖపైపె రంగులేసి, బిల్లులు కొట్టేశారు.

రూ.కోటి 68లక్షలతో ఎవెన్యూ ప్లాంటేషన్‌

నగరమంతా పచ్చగా కనిపించేలా రూ. కోటి 40లక్షలతో జగనన్న హరిత నగరాల కింద శ్రీకాకుళం నగరంలోని 18 ప్రాంతాల్లో మొక్కలు నాటారు. కానీ, టీడీపీ హయాంలో మళ్లీ మొక్కలు నాటే కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేస్తూనే ఉన్నారు.

మరో రూ.10.50కోట్లతో నగరంలో బీటీ రోడ్లు

ఆర్‌ అండ్‌ బీ పరిధిలోకి రాని నగరంలోని మిగతా రోడ్లను అభివృద్ధి చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే రూ.10కోట్ల 50లక్షల 31వేలు మంజూరయ్యాయి. 37 ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేయడమే కాకుండా పనులు చేపట్టారు.

శాంతినగర్‌ కాలనీలో నాగావళి రివర్‌వ్యూ పార్క్‌

రూ.కోటి 40లక్షలతో స్మార్ట్‌ స్ట్రీట్‌ రోడ్డు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కలెక్టరేట్‌ నుంచి కొత్తపేట వరకు స్మార్ట్‌ స్ట్రీట్‌ రోడ్డు నిర్మించారు. మోడల్‌ రోడ్డుగా రూ. కోటి 40లక్షలతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డుకు ఇరువైపులా గ్రీనరీతో పాటు మ్యురల్‌ పెయింటింగ్స్‌తో అందంగా తీర్చిదిద్దారు. అక్కడే రోడ్డుకు ఆనుకుని ఉన్న చిన్న పార్క్‌ను కూడా అభివృద్ధి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement