రాప్తాడులో టీడీపీ దౌర్జన్యకాండ | - | Sakshi
Sakshi News home page

రాప్తాడులో టీడీపీ దౌర్జన్యకాండ

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

కనగానపల్లి/రామగిరి: రాప్తాడు నియోజకవర్గంలో అధికార టీడీపీ నాయకులు దౌర్జన్యాలు, దుర్మార్గాలకు తెగబడ్డారు. కనగానపల్లి మండలంలోని కోనాపురం, ముత్తువకుంట్ల, తగరకుంట, కనగానపల్లి గ్రామాలతో పాటు రామగిరి మండలంలోని పేరూరు, పెదకొండాపురం, మాదాపురం గ్రామాల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి ఉదయాన్నే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేశారు. తర్వాత టీడీపీ నాయకులు, గూండాలు పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి రిగ్గింగ్‌ చేసుకున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు కూడా తెగబడ్డారు. ఈ దాడులలో కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పూజారి హరికి తలకు తీవ్రమైన గాయమైంది. ఇక పలు కేంద్రాల వద్ద పోలీస్‌ సిబ్బంది ఒకరిద్దరిని మాత్రమే పెట్టడంతో పాటు పోలీస్‌ అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకే సహకరించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు.

ఎన్నికలు బహిష్కరణ

పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికార టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దౌర్జన్యాలను భరించలేక కనగానపల్లి మండలంలోని కోనాపురం, కనగానపల్లి ముత్తువకుంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు మల్లికార్జున, లక్ష్మిభారతి, అక్కమ్మతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థి మల్లేసు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు వచ్చేశారు.

ఇతర రాష్ట్రాల వారితో ఓటింగ్‌

రామగిరి మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుండగా, ఇప్పటికే ఏడు స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన మూడు స్థానాలనూ దక్కించుకునేందుకు కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌,బిహార్‌, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మూకలను రప్పించారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేశారు. పేరూరు–1, పెద్దకొండాపురం ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా అడ్డుకోవడంతో ఆ పంచాయతీల్లోని ప్రజలు రోడ్డుపైకి వచ్చి ‘పరిటాల’ అరాచకాలపై నిరసన తెలిపారు. ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

కనగానపల్లి, రామగిరి మండలాల్లో

ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్‌

పలుచోట్ల ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement